గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 33 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని గాజా అధికారులు తెలిపారు. గాజాలో వందకుపైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడులు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లే సమయంలో జరగడం విశేషం.