ఇరాన్‌పై జరుగుతున్న దాడుల్లో మరో ఇద్దరు కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన చీఫ్ మహ్మద్ కజేమీ, అతని డిప్యూటీ హసన్ మోహకికిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అలాగే ఇరాన్ ప్రయోగించిన 100కుపైగా డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టినట్లు తెలిపింది. ఇదివరకు జరిగిన దాడుల్లో అణు శాస్త్రవేత్తలు, మిలిటరీ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు.