యుద్ధం కోసం కుమారుడి పెళ్లి వాయిదా వేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని

69చూసినవారు
యుద్ధం కోసం కుమారుడి పెళ్లి వాయిదా వేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని
ఇజ్రాయెల్-ఇరాన్‌ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా రగులుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెతన్యాహు కుమారుడు అవ్‌నర్‌, అమిత్‌ యార్దేనీకి మరికొన్ని రోజుల్లో వివాహం జరగనుండగా.. యుద్ధం నేపథ్యంలో తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తున్న నాటి నుంచే నెతన్యాహు కుమారుడి వివాహ అంశం వివాదస్పదంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్