ఇస్రో చేపట్టిన 2025 అంతరిక్ష కార్యక్రమాల్లో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 మిషన్ కీలకం కానుంది. 2025 జూన్‌లో ప్రయోగించనున్న ఈ మిషన్ ద్వారా నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని భూమి కక్ష్యలోకి పంపనున్నారు. ఇది వ్యవసాయం, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణలో వినియోగించనున్నారు. శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ వాహనం ద్వారా ప్రయోగించనుండే ఈ ఉపగ్రహం భూ పరిశీలనలో కీలక పాత్ర పోషించనుంది.