UPలోని కుశీనగర్‌లో ISRO చారిత్రక రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. UP మట్టిలోంచి తొలిసారి రాకెట్ ద్వారా పేలోడ్ పంపించారు.. ఇది డ్రోన్‌లతో కాకుండా రాకెట్ ద్వారా జరిగిన మొదటి ప్రత్యక్ష ప్రయోగం అని ISRO శాస్త్రవేత్త అభిషేక్ సింగ్ తెలిపారు. Thrust Tech India Limited సహకారంతో జరిగిన ఈ పరీక్షలో రాకెట్ 1.1 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. అక్టోబర్-నవంబర్‌లో ఉపగ్రహాల ప్రయోగానికి ఇది ముందడుగు.