TG: సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లాగా మారిపోయారని విమర్శించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం ఉందని ఎద్దేవా చేశారు. '28 ఎకరాల దేవనూరు భూమి కడియం శ్రీహరి బినామీ పేరుపై ఉన్నది వాస్తవం కాదా?. ఆ 28 ఎకరాల వద్ద తన బినామీలతో కడియం దిగిన ఫోటోలు నా వద్ద ఉన్నాయి' అని ఆరోపించారు.