కృష్ణాలో ఎక్కువ నీటిని వాడుకుంటున్నామన్నది అవాస్తవం: సీఎం

65చూసినవారు
కృష్ణాలో ఎక్కువ నీటిని వాడుకుంటున్నామన్నది అవాస్తవం: సీఎం
AP: కృష్ణా జలాల్లో ఏపీ అధిక నీటిని వాడుకుంటుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన వరకే వాడుకుంటున్నామని, అధికంగా వాడుకుంటున్నామనేది నిజం కాదన్నారు. తెలంగాణ, ఏపీలో గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, సముద్రంలో కలిసే నీటిని అదనంగా వాడుకుంటున్నామని ఆయన అన్నారు. కృష్ణా జలాల్లో కొంత సమస్య ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్