వాకింగ్, జాకింగ్‌కు వెళ్లేవారు ఉదయం 8 గంటల్లోపే ఇంటిముఖం పట్టాలని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రమైతే 6 గంటల తర్వాత మొదలుపెట్టడం ఉత్తమం. వ్యాయామాలు చేసేటప్పుడు తేలికపాటి, లేతరంగు దుస్తులతోపాటు తలకు టోపీ తప్పకుండా ధరించాలి. రోజూ గంట వ్యాయామం చేసేవాళ్లు వేసవిలో 45 నిమిషాలు చేస్తే చాలట. ఎండకి శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది కాబట్టి.. మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.