TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకున్న దశలో మరోసారి వాయిదా పడినట్లు కనిపిస్తోంది. దీనికి కారణం పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానికి రాసిన లేఖనే అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ లేఖలో ఏం రాశారో ఖచ్చితంగా బయటకు రాలేదుగానీ, దాని ప్రభావం మాత్రం గట్టిగానే కనిపిస్తోంది. దీంతో చాలా రోజుల నుంచి పదవులు వస్తాయని ఆశించిన కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.