ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' మేం 280 కంటే ఎక్కువ పరుగులు చేస్తే పరిస్థితి మరోలా ఉండేది. టీమ్‌ఇండియాను అడ్డుకోవడానికి మన బౌలర్లు చాలా కష్టపడ్డారు. స్పిన్నర్లు భారత బ్యాటర్లను కట్టడి చేయడానికి ప్రయత్నించడంతో మ్యాచ్ చివరి వరకు వచ్చింది' అని స్మిత్ వెల్లడించారు.