వాంఖడే వేదికగా IND vs NZ మూడో టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. డారిల్- యంగ్ జోడీని రవీంద్ర జడేజా విడగొట్టాడు. అద్భుతమైన బంతిని అడ్డుకోబోయిన యంగ్ స్లిప్‌లోని రోహిత్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బ్లండెల్(0)ను జడ్డూ క్లీన్ బౌల్డ్ చేశాడు. వీరిద్దరినీ ఒకే ఓవర్లో ఔట్ చేయడం విశేషం. తొలి రోజు ఆట టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 192/6 పరుగులు చేసింది.