తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జగదీశ్‌రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పులేదన్నారు. శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినది కాదన్నారు.