TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ నేపథ్యంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సభలో సభ్యులందరికీ సమాన హక్కులుంటాయని, సభ మీ సొంతం కాదని స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో స్పీకర్‌ను అవనించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.