AP: మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. ఎస్వీ గోశాల, పాస్టర్ ప్రవీణ్, వక్ఫ్ బిల్లుపై జగన్ మోహన్ రెడ్డి కులమతాలను రెచ్చగొడుతున్నారని, వాటిని మంత్రులు చాకచక్యంగా తిప్పుకొట్టాలంటూతిప్పికొట్టాలంటూ సూచించారు. అలాగే ఏ శాఖ పరిధిలో మంత్రులు ఆ శాఖ అంశాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బ్యూరోక్రసీలో అవినీతిపై ఈ మధ్య ఎక్కువగా చర్చకు వచ్చిన అంశాలపై ఆయన ప్రస్తావించారు.