ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని స్పష్టం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు. స్పీకర్‌గా తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనన్నారు. అసెంబ్లీ, నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాల సమస్యలపై చర్చించాలని సూచించారు.