"తెలంగాణ BRS జాగీరా?" అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఓ కథనం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెరలేపుతోంది. తెలంగాణ కోసం పోరాడింది BRS అని, తెలంగాణ తమ జాగీరే అని ఆ పార్టీ నేతలు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్ర పత్రికలు మరోసారి విషం చిమ్ముతున్నాయని మండిపడుతున్నారు. అయితే BRSని విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్లు కాదని కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు.