బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని చాంధ్వా గ్రామంలో శోభిరామ్, వసంతిదేవి దంపతులకు జన్మించారు. చిన్నతనంలో కుల వివక్షను ఎదుర్కొన్నారు. 1914లో స్థానిక పాఠశాలలో చదువు ప్రారంభించి, మెట్రిక్యులేషన్‌లో మొదటి డివిజన్ సాధించారు. 1927లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్ సైన్స్, 1931లో కలకత్తా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశారు. 27 ఏళ్లలో బీహార్ శాసన మండలి సభ్యునిగా రాజకీయ జీవితం మొదలుపెట్టారు.