బాబు జగ్జీవన్ రామ్ 1936-1986 మధ్య 50 ఏళ్లు పార్లమెంటు సభ్యునిగా రికార్డు సృష్టించారు. దేశంలో ఎక్కువకాలం కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1946-52లో కార్మిక, 1952-56లో సమాచార, 1956-62లో రవాణా, రైల్వే, 1962-63లో రవాణా, సమాచార, 1966-67లో కార్మిక, ఉపాధి, 1967-70లో ఆహార, వ్యవసాయ, 1974-77లో వ్యవసాయ, నీటి పారుదల, 1977-79లో ఉప ప్రధానిగా, 1971లో రక్షణ మంత్రిగా సేవలందించారు. హరిత విప్లవం, 1974 కరువు నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.