ఇటీవల జగిత్యాల జిల్లాలో భామి కంపించింది. భూ మాత శాంతించాలని బూరెలు (భక్షాలు, బొబ్బట్లు) చెట్ల మొదల్ల వద్ద భూమిలో వేసి "ఓం భూమౌ నమో నమః" మరియు "ఓం నమో భగవత్యై ధరణ్యై ధరణిధరే ధరే స్వాహా" అనే మంత్రోచ్ఛారణల క్రతువులతో పసుపు, కుంకుమలు సమర్పించి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భూమాతకు బూరెలంటే మక్కువని వాటిని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మ శాంతించి మరోసారి భూకంపం రాకుండా చూస్తుందని ప్రజల నమ్మకం.