బుగ్గారం: దొంగలు దొంగలు కలిశారు.. దొంగ ఫిర్యాదులు చేశారు

67చూసినవారు
ప్రజలను, ప్రభుత్వ నిధులను దోచుకున్న దొంగలు అంతా కలిసి తనపై తప్పుడు ఆరోపణలతో దొంగ ఫిర్యాదులు చేయించారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన బుగ్గారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేఖరులతో మాట్లాడారు. బుగ్గారం గ్రామానికి చెందిన నిరుపేద దళిత వృద్దుడు నక్క రాజలింగుకు మద్యం త్రాగించి, మాయ మాటలు చెప్పి తప్పుడు, అసత్యపు ఆరోపణలతో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తనపై ఫిర్యాదు చేయించారని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్