డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, జయంతి సంబరాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదివారం భారతీయ జనతా పార్టీ ధర్మపురి పట్టణ శాఖ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంచి నీళ్లతో శుద్ధి చేసి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, నలమాసు వైకుంఠం, బెజ్జరపు లవన్, రాయల్ల రవికుమార్ సిందే, స్తంభంకాడి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.