బీజేపీ సంఘటన్ సర్వ్ 2024 పరిపాలక సంస్థ సభ్యుడిగా కొత్తపేట తాజా మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు యాదవ్ ను మంగళవారం నియమించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ అనధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్న కొమ్ము రాంబాబు యాదవ్ ను మరో బాధ్యత వరించడం పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు శుభాకాంక్షలతో కూడిన శుభాభినందనలు తెలిపారు.