ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

81చూసినవారు
ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ చైర్మన్ రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి ఆశయ సాధనకు పునరంకితం కావాలని రవీందర్ శెట్టి కోరారు. అనంతరం పాఠశాల మహిళా ఉపాధ్యాయులు అంజలి, సుభాషిని, రజిత, జ్యోతి గార్లను శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్