ఎండపల్లి మండల తహసిల్దారుగా ఇక్కడే నాయబ్ తహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న ఎడ్ల అనిల్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జగిత్యాల కలెక్టర్ మధుబుజ్జి సత్య ప్రసాద్ బుధవారం కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేశారు. ఎండపల్లిలో తహసిల్దారుగా విధులు నిర్వహించిన కడార్ల రవికాంత్ ను జగిత్యాల ఆర్డీఓ కార్యలయానికి డిప్యూటేషన్ పై బదిలీ చేశారు. నూతన తహశీల్దార్ అనిల్ కు పలువురు శుభాకాంక్షలతో కూడిన శుభాభినందనలు తెలిపారు.