ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ కుటుంబ సభ్యులు గొడిశెలపేట, ముంజంపల్లి గ్రామాల్లోని దేవాలయాలను దర్శించుకున్నారు. గొడిశెలపేట శ్రీ చెన్న కేశవ స్వామి సమేత శ్రీదేవి (లక్ష్మి) భూదేవి దేవాలయాన్ని, ముంజంపల్లి వెంకటేశ్వర స్వామి సమేత అలువేలు మంగ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వెల్గటూరు మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.