జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్ఐ కొక్కుల స్వేతకు వెల్గటూరు వాసులు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. మృతురాలు గతంలో వెల్గటూరు ఎస్సైగా విధులు నిర్వహించారు. ఆమెతో వెల్గటూరు వాసులకు గల గత జ్ఞాపకాల అనుబంధాన్ని నెమరు వేసుకొని నేతలు, పోలీసులు, ప్రజలు మృతురాలు స్వేతకు నివాళులర్పించారు.