టియుడబ్ల్యుజె (ఐజేయు ) జర్నలిస్టు సంఘం జగిత్యాల జిల్లా నూతన సభ్యత్వ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె. సురేంద్ర కుమార్ ఐజేయు జిల్లా నేతలతో కలిసి నూతన సభ్యత్వ, సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హత ఉండి, ఔత్సాహిక జర్నలిస్టులు సభ్యత్వాలను సద్వినియోగం చేసుకోవాలని సురేంద్ర కుమార్ కోరారు.