ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయానికి ఆలయ కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా గోనె శరత్ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గంగాధరి రాజేశం, కోశాధికారిగా తిగుల్ల కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సింహరాజు క్రాంతి విశ్వకర్మ, కార్యదర్శిగా గాజుల శివలింగం, సంయుక్త కార్యదర్శిగా బూరగడ్డ లచ్చయ్య గౌడ్, ప్రచార కార్యదర్శిగా కొక్కిరాల గోపాలరావు, కార్యవర్గ సభ్యులుగా 11 మంది ఎంపికయ్యారు.