జగిత్యాల జిల్లా, మల్యాల మండలం తాటిపల్లిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయములో సోమవారం రాజ్యాంగ రూపకర్త మరియు సమ సమాజ నిర్మాణ దార్శనికుడు, డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు మార్కెట్ చైర్ పర్సన్. బి. అరుణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటి కార్యదర్శి ఏ. వరలక్ష్మి, పాలక వర్గ సభ్యులు, మార్కెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.