రాజారాంపల్లి విద్యుత్ విభాగం పరిధిలోని ఎండపల్లి, కొత్తపేట విద్యుత్తు సబ్ స్టేషన్ లలో మరమ్మత్తు పనుల నిమిత్తం శనివారం 4 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. రాజారాంపల్లి ఏఈ బండి సమ్మయ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎండపల్లి, కొత్తపేట, అంబారిపేట, పడకల్, గ్రామాలకు రాజారాంపల్లి వ్యవసాయ మోటార్ల ఫీడర్ లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ తెలిపారు.