బీర్పూర్ లో బీజేపీ సంబరాలు

78చూసినవారు
బీర్పూర్ లో బీజేపీ సంబరాలు
బీర్పూర్ మండల బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఢిల్లీలో బీజేపీ గెలిచిన సందర్బంగా శనివారం సంబరాలు నిర్వహించారు. ఆనందంతో టపాసులు కాల్చుతూ ఒకరికొకరు మిఠాయిలు తినిపిస్తూ ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆడెపు నరసయ్య, సీనియర్ నాయకులు గర్శకుర్తి రమేష్, శీపతి రమేష్ మాట్లాడుతూ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం చాలా సంతోషించదగ్గ విషయమని, మార్పుకు సూచన అని అన్నారు.

సంబంధిత పోస్ట్