రేగుంట పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

61చూసినవారు
రేగుంట పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు
ప్రాధమిక పాఠశాల రేగుంటలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం జరుపుకున్నారు. విద్యార్థినులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. బాలురు రంగు రంగుల గాలి పటాలు ఎగుర వేశారు అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుమాల శంకర్ బాబు మాట్లాడుతూ పండుగల ప్రాముఖ్యతను వివరించి, పిల్లలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్