ఎండపల్లి మండల కేంద్రంలోని వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కందుకూరి వీరేశలింగం జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ వీరేశలింగం 16 ఏప్రిల్ 1848 జన్మించారు. ఇతను మహిళల విద్యను వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించిన సామాజిక సంఘ సంస్కర్త బాల్యవివాహం వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నగేష్, సభ్యులు రవి, కిరణ్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.