జగిత్యాల ప్రధాన కూడళ్ల వద్ద అక్రమ షెడ్లను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వినతి పత్రాన్ని జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా షెడ్లను నిర్మించి, ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నారని, మున్సిపల్ అధికారులు స్పందించాలని అన్నారు.