
సీనియర్ నటి కుష్బూ చేతికి గాయం
బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి కుష్బూ గాయపడ్డారు. తన ఎడమ చేతికి కట్టుతో ఉన్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘అనుకోని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూసినా ఆగిపోవద్దు. చిరునవ్వుతో ముందుకు సాగాలి.’ అని గాయంతో ఉన్న ఫోటోను జత చేసి రాసుకొచ్చారు. ఈ ఫోటో నెట్టింట వైరలయింది. కుష్బూ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు