జగిత్యాల పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష తీసుకున్న స్వాములు కొండగట్టుకు పోయే మరియు వచ్చే స్వాములందరికీ శుక్రవారం నీరు, మజ్జిగ, అరటిపండ్లు పంపిణీ చేస్తూ జై హనుమాన్ నినాదాలతో పలువురు స్వాములకు సేవ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండా సురేష్, పరంధాములు, గంగారెడ్డితో పాటు పలువురు వాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.