జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దాం: ఐఎంఏ డా. హేమంత్

78చూసినవారు
జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్ నివారణకు కృషి చేద్దాం: ఐఎంఏ డా. హేమంత్
సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్ కొరకు ప్రతి ఒక్కరం కంకణ బద్ధులై కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్ లో ఐఎంఏ జగిత్యాల శాఖ, జగిత్యాల గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి హేమంత్ మాట్లాడుతూ ప్రతినెల రెండవ శనివారం సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ ను చేపట్టామని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్