ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి వారిని శుక్రవారం జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి బోగ రాజ్ కుమార్, కోటగిరి అరవింద్-పద్మ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.