జగిత్యాల: గర్భిణీలు పోషక ఆహారం తీసుకోవాలి

71చూసినవారు
జగిత్యాల: గర్భిణీలు పోషక ఆహారం తీసుకోవాలి
జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ లో అంగన్వాడి కేంద్రంలో 3వ సెంటర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జగిత్యాల సూపర్వైజర్ రాజేశ్వరి ఆదేశాల మేరకు టీచర్స్ ఉమారాణి, స్వరూప రాణి, కళావతి, గంగ జమున ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా ఏప్రిల్ 8 నుండి 22 వరకు ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలను ఆహ్వానించి వారి బరువు ఎత్తులు చూసి ఆరోగ్య స్థితిని గూర్చి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్