జగిత్యాల పట్టణంలో తహసిల్ చౌరస్తా వద్ద ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బొల్లరపు దివాకర్ ఆధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ తొలి ఉపాధ్యాయురాలిగా మహిళలు చదువుకుంటేనే ఆ ఇంటికి వెలుగు అని చాటిన ధీశాలి సావిత్రి భాయ్ పులే సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడి దేశంలో మొదటి మహిళా పాఠాలకు పునాదులు వేశారు.