జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.