జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం చిలుకురి బాలాజీ టెంపుల్ అర్చకులు సురేష్ ఆత్మారామ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. మొదటగా కొండదిగువ ప్రాంతంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షణ ప్రారంభించారు. హనుమాన్ జయంతి కావడంతో భక్తులు గిరి ప్రదక్షణలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.