లింగంపేటలో 8 లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్లు ఆరుముల్ల నరసమ్మ పవన్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.