జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో ఆదివారం శాలివాహన(కుమ్మరి) సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నల్ల పోచమ్మ బోనాల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాసం ఉండి బోనం నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల నడుమ అమ్మవారి మందిరానికి తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.