సారంగాపూర్ మండలంలోని జెవులి గ్రామంలో ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈరోజు ఏకాదశి కావడంతో మహారాష్ట్రలో గల విట్టల రుక్మిణి లాగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వైదిక పురోహితులు యం శివకుమార్ అలంకరించారు. భక్తులు ఏకాదశి కావడంతో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.