ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల బత్తుల శంకర్ నియమించబడ్డారు. ఈ సందర్బంగా ఆయనను మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ శుక్రవారం తన స్వగృహమైన బసంత్ నగర్ లో శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.