జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ లో గల కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యే వసతి గృహాల వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు వారం రోజుల పైగా నీరు లేక కటకటమంటున్నాయి. సంబంధిత మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి రోజూ కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యే ఇదే రోడ్డు గుండా వెళ్తారు. అయినా పట్టించుకునే నాధుడే లేదు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి మొక్కలను రక్షించాలని వాకర్స్ మంగళవారం కోరారు.