ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఆదివారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగ రావు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జువ్వాడి నర్సింగరావు విచ్చేసి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 18 నెలల వ్యవధిలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.