జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు.