మెటుపల్లి లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక, రెండవ సిజిఆర్ఎఫ్ నిజామాబాద్ లోకల్ కోర్టును బుధవారం 33/11కేవీ ఉపకేంద్రం ఆవరణలో నిర్వహిస్తున్నట్టు మెటుపల్లి ఏడిఈ మనోహర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్ కోర్టులో మెటుపల్లి ఆపరేషన్ సబ్ డివిజన్ పరిధిలో గల మెటుపల్లి రూరల్, మెటుపల్లి టౌన్ -1, మెటుపల్లి టౌన్ -2 సెక్షన్ల కు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత పిర్యాదులు, సమస్యలు దాఖలు చేసుకొనే వీలుందన్నారు.